ప్రభాస్, మహేష్ సినిమా ఫిక్స్, రాజమౌళి డైరెక్టర్: ప్రకటించేసిన పెద్దాయన



సూపర్‌స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కలిసి సినిమా చేయబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈ భారీ మల్టీస్టారర్‌ను యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించనుందట. దీనిపై మరిన్ని ఆసక్తికర వివరాలు వెల్లడించారు సినీ విశ్లేషకులు ఇమంది రామారావు.ఇద్దరు పెద్ద హీరోలు కలిసి సినిమా చేయాలంటే అందుకు తగిన పవర్‌ఫుల్ స్క్రిప్ట్ కావాలి. పైగా వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉన్న రాజమౌళి, ప్రభాస్, మహేష్ సినిమా అంటే అసలు ఊహించగలమా? మహేష్, ప్రభాస్‌లతో కలిసి సినిమా చేయడానికి అసలు రాజమౌళికి టైం ఎక్కడిది. ఈ వార్తలు ఎక్కడి నుంచో పుట్టుకు రాలేదు. ప్రముఖ సినీ విశ్లేషకులు ఇమంది రామారావుగారే ఈ భారీ మల్టీస్టారర్‌ని ప్రకటించేసారు.వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. కానీ ఈ వార్తను ఫ్యాన్స్‌ జీర్ణించుకోవడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఎక్కవ మహేష్, ఎక్కడ ప్రభాస్. వీళ్లిద్దరూ సినిమాలో చేయడం ఏంటి? అందులోనూ దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో. ఇవన్నీ తెలిసాక సినిమా కచ్చితంగా వస్తే బాగుంటుందనే అనిపిస్తుంది. వీరి ముగ్గురి కాంబినేషన్ చలన చిత్ర పరిశ్రమలో మరో రికార్డ్ క్రియేట్ చేస్తుందనే చెప్పాలి. ‘బాహుబలి’, ‘సైరా’ కలెక్షన్స్‌ను ఈ సినిమా బీట్ చేస్తుంది’’